Mon Feb 02 2026 03:22:15 GMT+0000 (Coordinated Universal Time)
NaraLokesh : రెడ్ బుక్ పై లోకేష్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో తప్పు చేసిన వైసీపీ నేతల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో తప్పు చేసిన వైసీపీ నేతల పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని తెలిపారు. వారిని ఎవరినీ వదిలపెట్టేది లేదని లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా అరాచకాలకు పాల్పడిన వారందరూ చట్టప్రకారం శిక్ష అనుభవించక తప్పదన్నారు.
అధికారులు కూడా...
రెడ్ బుక్ లో రాజకీయ నేతలతో పాటు అధికారులు కూడా ఉన్నారన్నారు. అధికారులను కూడా తాము వదిలేది లేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మరోసారి లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు, అధికార వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.
Next Story

